’24’ సినిమా తమిళ ఆడియో కూడా హైద్రాబాద్‌లోనే.....
- March 17, 2016
తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా నటించిన ’24’ సినిమా ఈ సమ్మర్‌కు రానున్న భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. పోస్టర్స్, టీజర్స్ ఎవ్వరి ఊహకూ అందని స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన వినూత్న సినిమా కావడంతో ఈ సినిమాను సమ్మర్ సినిమాల్లో ఓ ప్రత్యేక సినిమాగానే చూడవచ్చు. మూవీ టీం కూడా సినిమాను అలాగే ప్రమోట్ చేస్తూ వస్తోంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈనెల 28న విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటే తమిళ ఆడియో ఆవిష్కరణ వేడుక కూడా అదే రోజున, హైద్రాబాద్‌లోనే జరగనుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఏ.ఆర్.రెహమాన్ అందించిన ఆడియోలో ఇప్పటికే విడుదలైన ‘కాలం నా ప్రేయసివే’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. సూర్య స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. ఏప్రిల్ నెలాఖర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







