సౌదీ జాతీయ దినోత్సవ సంబరాలు ప్రారంభం
- September 24, 2021
రియాద్: దిరియాహ్ గేట్ డెవలప్మెంట్ అథారిటీ, 91వ సౌదీ జాతీయ దినోత్సవ వేడుకల్ని రియాద్‌లో అంగ రంగ వైభవంగా ప్రారంభించింది. కఠిన కోవిడ్ నిబంధనల్ని చాలావరకు సడలించిన తర్వాత జరుగుతున్న ఉత్సవాలివి. పెద్దయెత్తున సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సౌదీ ఆటోమొబైల మరియు మోటర్ సైకిల్ ఫెడరేషన్, ఓ పెరేడ్‌ని చేపట్టడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హలె్త్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంయుక్తంగా పలు కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. సంప్రదాయ దిరియా హోమ్స్, అర్ధా పెర్ఫామర్స్‌తో కార్యక్రమాల్ని నిర్వహించారు. వన్ నేషన్ థీమ్ ద్వారా మరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్శకులకు మాస్కులు అందించడం, శానిటైజర్లు అందించడం ద్వారా కోవిడ్ ప్రోటోకాల్స్ అందరూ పాటించేలా చర్యలు తీసుకున్నారు. క్యామెల్, కల్వరీ మార్చ్ మరో ప్రధాన ఆకర్షణ. రాయల్ అల్ హిజానా మరియు రాయల్ మార్చింగ్ బ్యాండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. లేజర్ షో మరో ప్రధాన ఆకర్షణ అయ్యింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







