'ది టర్న్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల
- September 24, 2021
హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది టర్న్'. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్ సారథీ సంగీతం సమకూరుస్తుండగా ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ అందిస్తున్నారు. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ది టర్న్ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మెచ్చే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. మా హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయన నటన చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







