లెవల్‌ 1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మెడికవర్‌ హాస్పిటల్స్

- September 24, 2021 , by Maagulf
లెవల్‌ 1 కార్డియాక్‌  ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మెడికవర్‌ హాస్పిటల్స్

హైదరాబాద్: భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో అతి సహజ కారణాలలో ఒకటిగా కార్డియో వాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ) నిలుస్తున్నాయి. దాదాపు సగానికి  పైగా సీవీడీ మరణాలు అకస్మాత్తుగానే జరుగుతుంటాయి. చాలా వరకూ హార్ట్‌ ఎటాక్స్‌ను  ఔట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ (ఓహెచ్‌సీఏ)గా వ్యవహరిస్తుంటారు. తీవ్రమైన గుండె పోటు సంభవించిన పరిస్థితులలో తక్షణ వైద్య సహాయం అందించాల్సి ఉంది.

విషాదకరమైన అంశం ఏమిటంటే వయసు పరంగా  40 సంవత్సరాలు దాటి  35–40% కార్డియాక్‌ అత్యవసర పరిస్థితి   కలిగిన వ్యక్తులలో 50% మంది మృత్యువాత పడుతున్నారు. 
తీవ్రమైన గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా సంభవించే మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో దేశంలో వినూత్నమైన ‘లెవల్‌ 1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌’ను మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రారంభించింది. 

సాధారణంగా హెల్త్‌కేర్‌ ఇనిస్టిట్యూట్స్‌ను ఆ హాస్పిటల్‌లో ఉన్న సదుపాయాలు, అందుబాటులోని మానవ వనరులు ఆధారంగా కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ పరంగా మూడు విభాగాలుగా విభజిస్తారు. అందులో మొదటిది, అత్యున్నతమైనది లెవల్‌ 1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌. ఇక్కడ 24 గంటలూ ప్రైమరీ పీసీఐ సదుపాయాలు ఉండటంతో పాటుగా ఇంపెల్లా, మెకానికల్‌ సర్క్యులేటరీ సపోర్ట్‌ (ఎంసీఎస్‌) ఉపకరణాలూ, 24 గంటలూ  ఎంసీఎస్‌ బృందం అందుబాటులో ఉంటుంది. లెవల్‌ 2 కేంద్రంలో ఎంసీఎస్‌ ఉపకరణాలు లేదంటే బృందం ఉండదు. ఇక లెవల్‌ 3లో కేవలం మెడికల్‌ కేర్‌ మాత్రమే లభ్యమవుతుంది. లెవల్‌ 1 కేంద్రాలతో  గుండె విఫలమైన లేదంటే రక్తపోటు పరంగా తీవ్రహెచ్చుతగ్గులతో గుండెపోటు బారిన పడిన  రోగుల అదృష్టాన్ని మార్చవచ్చు. లెవల్‌ 1 కేర్‌తో  ప్రభావిత వ్యక్తుల ప్రాణాలను దాదాపు 80% వరకూ కాపాడవచ్చు.

మెడికవర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘వేగవంతంగా రోగి స్థితిని అంచనా వేయడంతో పాటుగా అంతే వేగంగా చికిత్సను ఆరంభించడం ద్వారా క్లిష్టమైన స్థితిలో వచ్చిన రోగులు త్వరగా కోలుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో ఈ తరహా లెవల్‌ 1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌ కలిగిన మొట్టమొదటి హాస్పిటల్‌గా మెడికవర్‌ హాస్పిటల్‌ నిలుస్తుంది’’ అని అన్నారు.
మెడికవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా వద్ద చికిత్సకు వచ్చిన రోగులకు ఏ కొద్ది పాటి ప్రయోజనం కలిగే ఆవిష్కరణ అయినా స్వీకరించేందుకు మెడికవర్‌ గ్రూప్‌ ముందుంటుంది.  లెవల్‌ 1 కార్డియాక్‌ ఎమర్జెన్సీ కేర్‌ సెంటర్‌ వినూత్నమైనది. తీవ్ర అనారోగ్యానికి గురైన హార్ట్‌ ఎటాక్‌ రోగులలో ఫలితాలను మెరుగుపరుస్తుంది’’అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com