ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్..
- September 24, 2021
అమరావతి: వైద్య ఆరోగ్య శాఖ పై సీఎం జగన్ సమీక్షించారు. సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్ మొదలు పెట్టాలన్నారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ భర్తీ చేయాలన్నారు. అక్టోబరు నుంచి ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియ నవంబర్ 15 నాటికి ముగించాలన్నారు. ఈ కార్యాచరణకు సీఎం జగన్ ఆమోదం ముద్ర వేశారు.
సిబ్బంది కొరతలేకుండా నియామకాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం.
సీఎం జగన్ కామెంట్స్..
ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నామన్నారు. తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉందన్నారు. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నామన్నారు. ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నారు. ఈ దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. కావాల్సిన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాన్నారు.
ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా … దీనికి తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలన్నారు. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితికాని.., తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కాని ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం జగన్.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







