అబుదాబీలో ఘనంగా జరిగిన 'తెలంగాణ అవతరణ వేడుకలు'
- June 06, 2015
గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి సమర్పించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అబుదాబీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం (జూన్ 5) సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అయిన కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు కవిత గారిని ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విదేశాల్లో టీఆర్‌ఎస్ శాఖలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికులకూ బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్, మిమిక్రీ శ్రీనివాస్, సాయిచంద్, స్వర్ణక్క, పద్మావతి,నక్క భాస్కర్ రావు తదితరులు అబుదాబీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుని, ఆహూతుల్ని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







