మళ్లీ రానున్న చంద్రముఖి
- March 17, 2016
రజనీ కాంత్ కెరీర్ ముగిసిపోయినట్టే అనుకున్న సమయంలో మరోసారి సూపర్ స్టార్ ను సూపర్ డూపర్ ఫాంలోకి తీసుకొచ్చిన సినిమా చంద్రముఖి. ఈ సినిమాతో దర్శకుడు పి.వాసు కూడా స్టార్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ ఈ సినిమా విజయం తరువాత తన మీద ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకోవటంతో విఫలమయ్యాడు వాసు. చంద్రముఖి సినిమా తరువాత పి వాసు దర్శకత్వంలో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా రాలేదు.ఇటీవల కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా శివలింగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన పి.వాసు, ఆ సక్సెస్ ను అలాగే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మరోసారి చంద్రముఖినే నమ్ముకుంటున్నాడు. చంద్రముఖి సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించి తమిళంలో కూడా సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
మరోసారి రజనీ హీరోగానే ఈ సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.చంద్రముఖి తరువాత అదే కాన్సెప్ట్ తో నాగవల్లి సినిమా చేసిన పి.వాసు భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఈసారి అలాంటి పొరపాట్లేవీ జరగకుండా చంద్రముఖిని మరిపించే స్థాయిలో చంద్రముఖి2ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి చంద్రముఖి, పి.వాసుకు రెండోసారి కూడా స్టార్ స్టేటస్ ఇస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







