వెటరన్ మోటరిస్టులకు సత్కారం
- March 17, 2016
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నిర్వహించిన యాన్యువల్ సెర్మనీలో వెటరన్ మోటరిస్టుల్ని సత్కరించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ, స్టాఫ్ మేజర్ జనరల్ సాద్ బిన్ జస్సిమ్ అల్ ఖులైఫి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోహాలో 32వ గల్ఫ్ ట్రాఫిక్ వీక్ సందర్భంగా ఈ వెంట్ జరిగింది. స్టాఫ్ మేజర్ జనరల్ అల్ ఖులైఫి మాట్లాడుతూ, ట్రాఫిక్ అథారిటీ వర్గాలు ఓల్డ్ జనరేషన్ మోటరిస్టుల్ని సత్కరించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఓల్డ్ జనరేషన్‌ని సత్కరించడం ద్వారా కొత్త జనరేషన్‌కి మంచి మెసేజ్ ఇచ్చినట్లవుతుందని ఆయన వివరించారు. బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి మాట్లాడుతూ, యంగ్ జనరేషన్, సీనియర్ మోటరిస్టుల్ని రోల్ మోడల్స్‌గా తీసుకోవాలనీ, యాక్సిడెంట్లు లేకుండా వారు వాహనాల్ని నడపడం పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఎవేర్‌నెస్ యాక్టివిటీస్ ద్వారా రోడ్డు ప్రమాదాల్ని తగ్గించగలుగుతున్నట్లు అల్ ఖర్జి చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన యాక్సిడెంట్ల సంఖ్య గత ఏడాది జనవరిలో జరిగిన యాక్సిడెంట్లతో పోల్చితే 80 తక్కువగా వున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







