బలం కోల్పోతున్న ఐఎస్‌ఐఎస్
- March 17, 2016
ఇరాక్, సిరియాల్లో ఐఎస్‌ఐఎస్ క్రమంగా పట్టుకోల్పోతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత పదిహేను నెలల్లో కరడుగట్టిన తీవ్రవాద సంస్థ తన అధీనంలో ఉన్న ప్రాంతాల్లో 22శాతంపై పట్టు కోల్పోయిందని తేలింది. ముఖ్యంగా గడచిన 3 నెలల్లో 8శాతం ప్రాంతం వారి చేజారిపోయిందని స్పష్టం చేసింది. ఆర్థికంగా, మందీమార్బలంలోనూ తీవ్రనష్టాలను ఎదుర్కొంటోందని వెల్లడించింది. ఐహెచ్‌ఎస్ జాన్‌సే360 అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అతిక్రూరంగా ప్రత్యర్థులను మట్టుబెట్టి, ఆ దృశ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ఐఎస్‌ఐఎస్‌పై ప్రపంచదేశాలనుంచి దాడులు పెరగడంవల్ల ఈ పరిణామాలు సంభవించాయని ఆ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







