ఇండియా ఏవియేషన్ 2016లో ఖతార్ ఎయిర్వేస్ ఎ350
- March 17, 2016
ఇండియా ఏవియేషన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్‌లో ఖతార్ ఎయిర్వేస్ ఎ350 ను ప్రదర్శించింది. న్యూ జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన ఎ350 మీడియం టు లాంగ్ హాల్ ఆపరేషన్స్ కోసం నిర్దేశించబడింది. ఇండియాలో ఇదే ఈ విమానానికి తొలి ప్రదర్శన. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ జరుగుతోంది. మార్చ్ 16 నుంచి 20 వరకు జరగనుంది ఈ ఎయిర్ షో. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో హజరయ్యారు. ఖతార్ ఎయిర్వేస్ ఎ350 ఆపరేషన్స్ ఇటీవలే ఏడాది పూర్తిచేసుకున్నాయి. ప్రపంచంలోనే టెక్నలాజికల్లీ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఎ350 పేరొందింది. ఫ్రాంక్ఫర్ట్, మ్యునిచ్, ఫిలడెల్ఫియా మరియు సింగపూర్‌లకు ఎ350 ప్రయాణిస్తోంది. అడిలైడ్, బోస్టన్ మరియు న్యూయార్క్‌లకు కొత్తగా విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖతార్ ఎయిర్ వేస్ మొత్తం 8 ఎ350 విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







