సామాన్యుడి కన్ను - దుబాయ్ పోలీస్ కొత్త వ్యూహం
- March 17, 2016
'వి ఆర్ పోలీస్' పేరుతో దుబాయ్ పోలీస్ కొత్త వ్యూహాన్ని పన్నారు. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పబ్లిక్‌లో అవేర్నెస్ పెంచి, రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారి ఆట కట్టించనున్నారు దుబాయ్ పోలీసులు. పబ్లిక్ చెయ్యాల్సిందల్లా, నిబంధనల్ని ఉల్లంఘించేవారిని తమ కెమెరాల్లో బంధించి ఆ వీడియోలు లేదా ఫొటోల్ని దుబాయ్ పోలీసులకు అందించడమే. గడచిన 10 నెలల్లో 3,748 ఉల్లంఘనలకు సంబంధించి ఆధారాల్ని సామాన్యుల నుంచి సేకరించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న వారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలే ఎక్కువగా వచ్చినట్లు కల్నల్ సైఫ్ ముహైర్ చెప్పారు. వాహనాల నెంబర్లు కన్పించేలా ఫొటోల్ని సామాన్యులు పంపవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచడం, ట్రాఫిక్ సమస్యల పట్ల ప్రజల్లో చైతన్య పెంచడం, సామాజిక బాధ్యతను అలవాటు చేయడంలో భాగంగా 'వి ఆర్ పోలీస్'ని ప్రాంభించినట్లు కల్నల్ సైఫ్ ముహైర్ వివరించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







