బంపర్ మెజారిటీతో గెలిచిన మమతా బెనర్జీ
- October 03, 2021
పశ్చిమ్ బెంగాల్: పశ్చిమ్ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ ఉప-ఎన్నిక ఫలితాల్లో మమతా బెనర్జీ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 58వేల 389 ఓట్లతో గెలిచి ప్రత్యర్థులకు పరాభవం చవిచూపారు. 2021 మార్చి- ఏప్రిల్ మధ్య జరిగిన పశ్చిమ్ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ మెజారిటీతో విజయం సాధించింది.
ఆ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓటమి చవిచూసిన మమతా మళ్లీ పోటీ చేయకతప్పలేదు. భవానీపూర్‌లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన కౌంటింగ్ మమతాకు గుడ్ న్యూస్ వినిపించింది. మొత్తం 21 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.
సెప్టెంబరు 30న జరిగిన పోలింగ్‌లో 57 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. ఎవరు గెలిచినప్పటికీ గెలుపు సంబరాలు వంటివి చేసుకోవద్దని ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రాకేశ్ కుమార్ ఆదివారం ఉదయం సర్కూలర్ జారీ చేశారు. గతంలో భవానీపూర్ నుంచి మమతా 2011, 2016 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







