ఎనిమిది రోజుల ఈశాన్యభారత పర్యటనలో భాగంగా అస్సాం విచ్చేసిన ఉపరాష్ట్రపతి

- October 03, 2021 , by Maagulf
ఎనిమిది రోజుల ఈశాన్యభారత పర్యటనలో భాగంగా అస్సాం విచ్చేసిన ఉపరాష్ట్రపతి
గౌహతి: గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక చికిత్స కాన్సర్ సదుపాయాలను అందించడానికి ప్రైవేట్ రంగం ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యమై పని చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.ఈశాన్య భారతంలో ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం గౌహతి చేరుకున్న ఆయనకు, గవర్నర్, ముఖ్యమంత్రి సహా ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్ర కాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పి.ఈ.టి-ఎం.ఆర్.ఐ. మెషిన్ ను ప్రారంభించిన ఆయన, ఇది కచ్చితమైన రోగ నిర్ధారణకు గొప్పగా సహాయపడడమే గాకుండా, రోగులు రేడియేషన్ కు గురి కావడాన్ని తగ్గిస్తుందని ఆయన తెలిపారు. 
అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంతో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటెడ్ కాన్సర్ కేర్ మోడల్ అనే స్టెప్ డౌన్ కాన్సర్ కేర్ మోడల్ గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ పద్ధతిని కాన్సర్ రోగులకు సకారంలో సమర్థవంతమైన చికిత్స అందించడానికి ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాలని సూచించారు. 
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చన్నఉపరాష్ట్రపతి, విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించాలని, ఇందు కోసం తల్లిదండ్రులు, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com