ట్రావెల్ బ్యాన్ ఉన్న దేశాలకు కూడా అనుమతి. బట్ కండిషన్స్ అప్లై
- October 04, 2021
సౌదీ: సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ట్రావెల్ బ్యాన్ చేసిన పది దేశాల్లోకి మళ్లీ ప్రయాణానికి అనుమతించింది. ఐతే కండిషన్ పెట్టింది. మానవతాథృక్పథంతో అత్యవసర సమయంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామంది. బంధవుల మృతి, అవయవదానం చేసే వారు, హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బంధువులను చూసేందుకు వెళ్లేవారికి అనుమతి ఇస్తామని జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్ పోర్ట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఇందుకు కోసం డైరెక్టరేట్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. వెబ్ సైట్ లో ముందుగా మై సర్వీస్, ఆ తర్వాత పాస్ పోర్ట్, ఆ తర్వాత తవసుల్ అనే అప్షన్ ను ఎంచుకోవాలని కోరింది. వెబ్ సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని వాటిని చదివిన తర్వాత ప్రయాణం కోసం అప్లయ్ చేయాలని కోరింది. ప్రస్తుతానికి సౌదీ పది దేశాల్లోకి ప్రయాణాన్ని బ్యాన్ చేసింది. అందులో ఇండియా సహా పాకిస్తాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, టర్కీ, బ్రెజిల్, ఇథియోపియా, వియత్నాం, అప్ఘనిస్తాన్, లెబనాన్ ఉన్నాయి. ఈ కంట్రీస్ కు అత్యవసరంగా వెళ్లే వారికి కోసం కొత్తగా నిబంధనలను సడలించింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







