ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరణ
- October 04, 2021
ముంబై: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్‌ను వైద్య పరిక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆర్యన్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా కోర్టు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరిస్తూ ఆ పటిషన్‌ను కొట్టి వేసింది. కాగా ఆర్యన్‌ను ఈ నెల 7వ తేదీ వరకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్‌సీబీ కోర్టును కోరింది. ఆర్యన్‌తో పాటు ఆర్భజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచతో పాటు మిగిలిన వారు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) శనివారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక రేవ్ అందులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







