నేటి నుంచి ఫీల్డ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాం

- October 11, 2021 , by Maagulf
నేటి నుంచి ఫీల్డ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాం

కువైట్: కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇవాళ్టి నుంచి సమగ్ర వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇప్పటివరకు టీకా తీసుకోలేని వారిని గుర్తించి వాక్సిన్ లు వేయనున్నారు. మొదటగా ఈ ప్రోగ్రాం బనీద్ అల్-ఖార్ ప్రాంతంలో ప్రారంభించనున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో వివిధ కారణాలతో వ్యాక్సిన్ పొందలేకపోతున్న కార్మికులే లక్ష్యంగా ఈ  ప్రొగ్రాం ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫీల్డ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో భాగంగా సహకార సంఘాలు,  వాణిజ్య సముదాయాలు, సెలూన్లలో పనిచేసే కార్మికులు..వ్యవసాయ కార్మికులు అలాగే బ్యాంకులు, ఫుడ్ ఇండస్ట్రీ, మసీదులలో పనిచేసే వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com