హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇప్పుడు 65 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు
- October 11, 2021
, by Maagulf
- సెప్టెంబరులో కోవిడ్‌కు మునుపటి దేశీయ ప్రయాణికుల సంఖ్యలో 62 శాతం.
- అక్టోబర్ 9న 77 శాతం చేరిన ప్రయాణికుల సంఖ్య.
- భారతదేశం అంతటా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు క్రమంగా ధైర్యం పెరుగుతోంది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో, అన్ని గమ్యస్థానాలకు విమాన సర్వీసుల డిమాండ్ పెరుగుతోంది. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, డిజిటలైజేషన్‌తో, ప్రయాణికులు విమానాలలో ధైర్యంగా ప్రయాణిస్తున్నారు. విమానయాన సంస్థలు కొత్త గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభిస్తూ, పాత వాటిని పునరుద్ధరిస్తున్నాయి.
- విమాన ప్రయాణంపై ప్రయాణీకుల విశ్వాసం పెరుగుతున్నందున, కుటుంబం/స్నేహితుల సందర్శన, విశ్రాంతి, వ్యాపార ప్రయాణాలు, అంతర్జాతీయ విద్యాసంస్థలలో చేరడానికి ప్రయాణిస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దేశీయ గమ్యస్థానాలకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక కొత్త నగరాలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తోంది.
- హైదరాబాద్ విమానాశ్రయం అన్ని దేశీయ గమ్యస్థానాలకూ విమానాల సంఖ్య పెరిగింది. సెప్టెంబర్‌లో విమానాశ్రయం నుంచి వచ్చీపోయే విమానాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదై, దాదాపు 9 వేలకు దగ్గరగా చేరింది.
- ప్రయాణీకుల రద్దీ పెరిగి, జూలైలో 6.8 లక్షల దేశీయ ప్రయాణీకులతో పోలిస్తే సెప్టెంబరులో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 9.35 లక్షల మంది దేశీయ ప్రయాణీకులు ప్రయాణించారు. ఇది కోవిడ్ ముందున్న ప్రయాణికుల సంఖ్యలో 62%. అంతర్జాతీయ ప్రయాణీకులలోనూ పెరుగుదల నమోదై, 1.2 లక్షలను చేరింది.ఇది కోవిడ్ పూర్వస్థాయిలో 41%. మొత్తం ప్రయాణీకుల సంఖ్య (దేశీయ, అంతర్జాతీయ) సెప్టెంబర్ నెలలో కోవిడ్ ముందు స్థాయిలో 59% కి చేరుకుంది.
- అక్టోబర్ 9న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కోవిడ్ అనంతరం అత్యధిక ప్రయాణికుల సంఖ్య నమోదైంది. ఆ రోజున దాదాపు 48 వేల మంది ప్రయాణికులు (జాతీయ, అంతర్జాతీయ) హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించారు. కోవిడ్‌కు మునుపటి ప్రయాణికుల సంఖ్యలో ఇది 77శాతం. అదే రోజు దాదాపు 350 విమానాల రాకపోకలు జరిగాయి.
- ప్రయాణీకుల సంఖ్యపరంగా దేశీయ గమ్యస్థానాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరుకు ఎక్కువ మంది ప్రయాణించగా, దుబాయ్, దోహా, షార్జాలకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది.
- ప్రయాణికుల సంఖ్య పెరగడానికి విశ్రాంతి/సెలవు ప్రయాణం, చిన్న మధ్యతరహా వ్యాపార ప్రయాణాలు, స్నేహితులు బంధువులను (VFR) సందర్శించడం వంటి వాటితో పాటు విద్యార్థులు ఎక్కువగా తోడ్పడ్డారు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రతిరోజూ ప్రయాణించే సగటు దేశీయ ప్రయాణీకులు జూలైలో రోజుకు 22,500 ఉండగా, సెప్టెంబర్‌లో వీరి సంఖ్య 31,137కి పెరిగింది.
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోవిడ్‌కు ముందు 55 దేశీయ గమ్యస్థానాలుండగా, అదిప్పుడు 65ను చేరుకుంది. గత మూడునెలల కాలంలో హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్, శ్రీనగర్, జామ్‌నగర్ వంటి కొత్త దేశీయ సెక్టార్లను జోడించారు.
- ఇటీవల హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌కు ఎయిర్ ఇండియా తొలి డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభించింది. ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానాలు హైదరాబాద్, హీత్రూ విమానాశ్రయం మధ్య వారానికి రెండుసార్లు-సోమవారం, శుక్రవారం-నడుస్తాయి. అలాగే, ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించే ‘ఉడాన్’ కింద, స్టార్ఎయిర్ హైదరాబాద్ నుండి జామ్‌నగర్‌కు తొలి విమాన సర్వీసు ప్రారంభించింది.
- ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు హైదరాబాద్ నుంచి జామ్‌నగర్, జమ్మూ, చండీగఢ్ వంటి దేశీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణీకుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదైంది. ఆగస్టుతో పోలిస్తే జామ్‌నగర్‌కు సెప్టెంబర్‌లో 346% ప్రయాణీకుల వృద్ధి రేటు నమోదు కాగా, జమ్మూ 286% మరియు చండీగఢ్‌కు 244% వృద్ధి రేటు నమోదైంది.
_1633960008.jpg)
_1633960021.jpg)