అక్టోబర్ 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
- October 13, 2021
హైదరాబాద్ : ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను 17న విడుదల చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ.. . టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్ర స్థాయి నుంచి మొదలుకుని పట్టణ, మండల స్థాయి వరకు కమిటీ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. అలాగే.. అక్టోబర్ 25న జనరల్ బాడీ మీటింగ్… ఆ తర్వాత పార్టీ ప్లీనరీ సమావేశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 15న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన నిర్వహిస్తామన్నారు. ఈ విజయ గర్జనను విజయవంతం చేసేందుకు అక్టోబర్ 27 నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయని కేటీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







