త్వరలో వాట్సాప్ ద్వారా పార్కింగ్ ఫీ చెల్లింపులు
- October 18, 2021
దుబాయ్: వచ్చే రెండు వారాల్లో దుబాయ్‌లోని వాహనదారులు తమ పార్కింగ్ టిక్కెట్ ఫీని సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ఈ మేరకు పార్కింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ మహబౌబ్ తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వద్ద అదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాట్సాప్ చెల్లింపు సిస్టం టెస్టింగ్ చివరి దశలో ఉందని, రెండు వారాల్లోపు ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
"SMS పార్కింగ్ కోసం ఉపయోగించే పద్ధతిలోనే వాట్సాప్ చెల్లింపు విధానం ఉంటుందన్నారు. 7275 కు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే.. అదే మెసేజ్ ను తిరిగి కస్టమర్ కు పంపి ధృవీకరించుకుంటారు. ఆ తర్వాత నిర్దేశిత మొత్తం డిజిటల్ వాలెట్ నుండి డెబిట్ అవుతుంది." అహ్మద్ మహబౌబ్ చెప్పారు.
వాట్సాప్ చెల్లింపు సిస్టం అందుబాటులోకి వస్తే వాహనదారులు SMS పార్కింగ్ టిక్కెట్ల కోసం UAE టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లిస్తున్న 30 ఫిల్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. పార్కింగ్ టిక్కెట్ ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకునే స్మార్ట్ మ్యాప్‌ను RTA మెరుగుపరిచిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







