12 ఏళ్ళ లోపు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను వాయిదా వేసిన సౌదీ అరేబియా

- October 20, 2021 , by Maagulf
12 ఏళ్ళ లోపు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను వాయిదా వేసిన సౌదీ అరేబియా

రియాద్: 12 ఏళ్ళ లోపు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను సౌదీ అరేబియా వాయిదా వేసింది. వాస్తవానికి అక్టోబర్ 31 నుంచి ఈ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఈ వయసు వారికి పొంచి వున్న ముప్పు కారణంగా ప్రత్యక్ష బోధన వాయిదా వేసి, వారికి ఆన్‌లైన్ విద్యను కొనసాగించనున్నారు. కాగా, ఇంటర్మీడియట్, సెకెండరీ లెవల్ (పబ్లిక్, ప్రైవేట్ మరియు విదేశీ స్కూళ్ళకు అలాగే యూనివర్సిటీ, టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌కి) ఆగస్ట్ 29 నుంచి ప్రత్యక్ష విద్యా బోధన జరుగుతుంది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారికి మాత్రమే ప్రత్యక్ష బోధన జరుగుతుంది. కాగా, ఈ గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com