ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి: అబుధాబిలో ఉచిత పార్కింగ్ ప్రకటన

- October 20, 2021 , by Maagulf
ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి: అబుధాబిలో ఉచిత పార్కింగ్ ప్రకటన

యూఏఈ: ప్రొఫెట్ మొహమ్మద్ జయంతి నేపథ్యంలో పబ్లిక్ పార్కింగ్ ఉచితమని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ - అబుదాబీ వెల్లడించింది. అలాగే వినియోగదారుల హ్యాపీనెస్ సెంటర్లు, డర్బ్ సమయాలు, బస్ మరియు ఫెర్సీ సర్వీసుల సమయాల్ని కూడా ప్రకటించారు. 21 అక్టోబర్ నుంచి 23 అక్టోబర్ ఉదయం 7.59 నిమిషాల వరకు సర్ఫేస్ పార్కింగ్ స్థలాల్లో ఉచితంగా వాహనాల్ని పార్క్ చేసుకోవచ్చు. ముసాఫా పారిశ్రామిక ప్రాంతంల పార్కింగ్ లాట్ ఎం18 కూడా ఉచితమే. నిషేధిత ప్రాంతాల్లో వాహనాల్ని పార్కింగ్ చేయకూడదని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తేలా వాహనదారులు వ్యవహరించరాదని హెచ్చరించారు. ఐటిసి సర్వీసుల్ని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. డర్బ్ టోల్‌గేట్ విధానం కూడా సెలవు కారణంగా ఉచితం.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com