డ్రగ్స్ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించకండి:సీఎం కేసీఆర్
- October 20, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులనుద్దేశించి మాట్లాడారు. గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, ఉన్నతస్థాయి సమావేశంలో విస్త్రుతంగా చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం కే చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సుదీర్గ పోరాటం ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. వ్యవసాయంలో వచ్చిన అభివృధ్ది వల్ల కోటి 30 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం పంజాబ్ ను మించిపోతున్నది. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాలలోని మారుమూల గ్రామాలకు సైతం పరిశుభ్ర జలాలందిస్తున్నాము. విద్యుత్ రంగంలో అపూర్వ విజయం సాధించాం. ఉద్యమ సమయంలో ఏవేవి ఆకాంక్షించామో వాటన్నింటిని నెరవేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నాము. జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలలో 99 శాతం సంస్థలు మనదగ్గర భారీ పెట్టుబడులను పెడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం వల్లనే పెట్టుబడులు మన రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయని’’ సీఎం కేసీఆర్ పెర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్రం యొక్క గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయివంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఈ పీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాను. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు అందజేసుకుని గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమాయకులైన యువకులు తెలిసీ తెలియక వీళ్ల బారిన పడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం వుంటుంది. డి అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. దీన్ని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. గంజాయి మాఫీయాను అణిచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించవలసిన అవసరం లేదని’’ కేసీఆర్ స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







