అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన : రోజా

- March 19, 2016 , by Maagulf
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన : రోజా

 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా.. తనను సభలోకి రెండోరోజు కూడా అనుమతించకపోవడంపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం వద్దే ఉదయం 9 గంటల నుంచి రోజా మౌనదీక్ష చేస్తున్నారు. అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆమెకు తమ మద్దతు పలికారు. కొంతమంది ఆమెకు సంఘీభావంగా అక్కడే కూర్చున్నారు. మహిళా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ఉప్పులేటి కల్పన, గౌరు చరిత, పుష్పవాణి, కళావతి, రాజేశ్వరి తదితరలతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రోజాకు మద్దతు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.మరోవైపు ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. తొలుత వాయిదా వేసిన తర్వాత కొద్ది సేపటికి మళ్లీ సమావేశమైంది గానీ, రెండోసారి పది నిమిషాలు వాయిదా వేసినా అరగంట తర్వాత కూడా సమావేశం కాలేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై చర్చిస్తున్నారు. కనీసం ఈ అంశంపై నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలాగని అడుగుతున్నా స్పందన లేదని ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com