నవ్యాంధ్రలో యువతకు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు : యనమల

- March 19, 2016 , by Maagulf
నవ్యాంధ్రలో యువతకు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు : యనమల

 నవ్యాంధ్రలో యువతకు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విశాఖ భాగస్వామ్య సదస్సుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఎస్సెల్‌, రిలయన్స్‌, వాల్‌మార్ట్‌ లాంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని, త్వరలోనే అవగాహన ఒప్పందాలు కార్యరూపం దాలుస్తాయని మంత్రి వివరించారు.వైకాపా తీరుపై విష్ణుకుమార్‌రాజు ఆగ్రహంసభలో వైకాపా సభ్యుల తీరుపై భాజపా శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. రోజాను సభలోకి అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ.. నినాదాలు చేశారు. సభలో మాట్లాడే అవకాశం లేకుండా వైకాపా సభ్యులు గందరగోళం చేయడం తగదని విష్ణుకుమార్‌రాజు ఘాటుగా విమర్శించారు. దీనిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని హెచ్చరించారు. సభాపతి అనుమతితో విష్ణుకుమార్‌రాజు వెనుక సీటులోకి వెళ్లి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వైకాపా సభ్యులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు ..దీంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ విగ్రహం ఎదుట రోజా ధర్నా ఏపీ శాసనసభ ప్రాంగణంలో రెండో రోజు కూడా అదే గందరగోళ పరిస్థితి నెలకొంది. వైకాపా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో రోజా ..గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆమెకు మద్దతుగా వైకాపా మహిళా ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com