తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- October 20, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,69,556కి చేరింది. కరోనా నుంచి 6,61,646 మంది కోలుకోగా మొత్తం 3,942 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 49 కేసులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మంచిర్యాల జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో వికారాబాద్, నారాయణపేట జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com