సుడాన్ ప్రధాని మంత్రి అరెస్ట్
- October 26, 2021
సుడాన్: ఆఫ్రికా లోని సూడాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అక్కడి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సైన్యం ప్రధానమంత్రితో పాటు పలువురు కీలక నేతలను నిర్బంధించింది. ఈ పరిణామాలతో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడంతోపాటు ఇంటర్నెట్ సేవలను సైన్యం నిలిపివేసింది. స్వాతంత్ర్యం పొందిన 1956 నుంచి సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేయడం ఇది ఎనిమిదవసారి.
సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆర్మీ జోక్యంతో 2019లో అల్-బషీర్ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేందుకు సైన్యం - ప్రజాస్వామ్యవాదుల మధ్య ఒప్పందం కుదిరింది.
ఒప్పందంలో భాగంగా ప్రధానిగా అబ్దుల్లా హమ్దోక్ మూడేళ్లపాటు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడి కోసం సైన్యం, పౌర నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రధాని హమ్దోక్ నిర్బంధించి ఆపని పూర్తి చేసేందుకు ఆర్మీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే సూడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా నిలిపివేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







