దొంగతనం కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు
- October 26, 2021
దుబాయ్ : ఓ గ్రాసరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు ప్రవాసులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులపై అభియోగాలు రుజువుకావటంతో వారికి ఏడాది పాటు జైలుశిక్ష 1700 దిర్హామ్స్ ఫైన్ వేసింది. జైలుశిక్ష పూర్తైన తర్వాత దోషులందరినీ దేశం నుంచి తిరిగి పంపించేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే గతేడాది అక్టోబర్ లో ఓ గ్రాసరీ షాప్ లో ముగ్గురు ఏషియాకు చెందిన ప్రవాసులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓనర్ పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో నిందితులందరికీ శిక్షపడింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







