బహ్రెయిన్ యువరాజును కలిసిన మక్తూమ్ బిన్ మహ్మద్

- October 26, 2021 , by Maagulf
బహ్రెయిన్ యువరాజును కలిసిన మక్తూమ్ బిన్ మహ్మద్

సౌదీ: దుబాయ్ డిప్యూటీ రూలర్, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి హెచ్‌హెచ్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్..  బహ్రెయిన్ యువరాజు, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫాతో  సమావేశమయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ (MGI) సమ్మిట్‌లో భాగంగా వారు సమావేశమయ్యారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్యం, భూమి క్షీణతను ఎదుర్కోవడానికి 50 బిలియన్ చెట్లను నాటాలని ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా  పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వనరుల స్థిరత్వాన్ని పెంచవచ్చని మక్తుమ్ అన్నారు. ఈ ఇనియేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతిపాదించిన  సౌదీ అరేబియాను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో నేచురల్ రిసోర్సెస్ పెంచటం, జీవన ప్రమాణ స్థాయి నాణ్యతను పెంచటానికి చేపట్టాల్సిన చర్యలపైన  చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com