భారత్ కరోనా అప్డేట్
- October 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏకంగా 3 వేల వరకు కేసులు పెరిగాయి.ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,156 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 733 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.ఇదే సమయంలో 17,095 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
ఇక, తాజాగా 12,90,900 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 60,44,98,405కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.42 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4,56,386 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి పెరిగింది.. యాక్టివ్ కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. మరోవైపు.. ఇక నిన్న 49,09,254 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 104 కోట్ల మైలురాయిని కూడా క్రాస్ చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







