భారత్-యూఏఈ ఫ్లైట్స్ లో కరోనా ఆంక్షలు సడలిస్తాం
- October 28, 2021
యూఏఈ:భారత్ నుంచి యూఏఈ, యూఏఈ నుంచి ఇండియా వెళ్లే విమాన ప్రయాణికులకు భారత విదేశాంగ సహాయ మంత్రి వి. మురళీధరన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే విమాన ప్రయాణాల్లో కరోనా కారణంగా విధించిన నిబంధనలను సడలిస్తామన్నారు. కోవిడ్ కేసులు భారీగా తగ్గినందున ఆ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు.యూఏఈ లో సిక్త్ మినిస్ట్రీయల్ కన్సల్టేషన్ మీటింగ్ కు అటెండైన తర్వాత ఆయన దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో విమాన ప్రయాణాల్లో ఆంక్షలు తొలగిస్తామన్నారు. అదే విధంగా విదేశాల్లో జాబ్ కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మీడియా ఆయనను ప్రశ్నించింది. విదేశాల్లో జాబ్ కోల్పోయిన కార్మికుల డేటాను సేకరించిన వారి స్కిల్ కు తగిన విధంగా దేశంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అందుకు తగిన విధంగా పలు కంపెనీలతో కలిసి జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..