వైజయంతీ మూవీస్ కి పూర్వ వైభవం...
- March 19, 2016
గత కొన్ని సంవత్సరాలుగా నిర్మించిన చిత్రాలతో వరుస వైఫల్యాలు చవిచూసిన మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కు రాష్ట్ర విభజన వరంగా మారింది. ఏపీ రాజధాని ప్రాంతంలో అశ్వనీదత్ కు ఉన్న దాదాపు 150 ఎకరాలలో భారీ భవంతుల నిర్మాణం కోసం ప్రస్తుతం బిల్డర్లు ఈ మెగా నిర్మాత చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
దీంతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో అశ్వనిదత్ కు ఉన్న మిగతా ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగిపోవడంతో, వైజయంతీ మూవీస్ కి పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. "శక్తి" సినిమాతో పాటు అంతకు ముందు, తర్వాత వైజయంతి బ్యానర్లో వచ్చిన సినిమాలతో భారీగా నష్టపోయిన అశ్వనిదత్ కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజా పరిస్థితుల నేపథ్యంలో వైజయంతి బ్యానర్ తోపాటు, ఆయన కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకదత్ లు నిర్మించే త్రి ఏంజల్స్ బ్యానర్లో లో కూడా పలు సినిమాలు రాబోతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక సినిమాను, రామ్ చరణ్ తో మరో సినిమాను ఇటీవల అశ్వనీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







