అమితాబ్ ఆలపించిన జాతీయ గీతంతో మ్యాచ్ ఆరంభం
- March 19, 2016
నిన్న జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో బాలీవుడ్ అగ్ర హీరోలు చూసేందుకు వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ కూడా ఈ మ్యాచ్ లైవ్ తిలకించారు. మ్యాచ్ ముందే తాను ఆ మ్యాచ్ తిలకిస్తానని చెప్పడంతో మ్యాచ్ తో పాటుగా బిగ్ బి ని కూడా చూసేందుకు వచ్చారు అభిమానులు. సిని, క్రికెట్ స్టార్స్ లు ఒక్కచోట కలిస్తే ఆ హంగామా ఎలా ఉంటుంది చెప్పండి. అంతేకాదు అమితాబ్ ఆలపించిన జాతీయ గీతంతో మ్యాచ్ ఆరంభించింది. అయితే మ్యాచ్ మొత్తం చాలా సరదాగా కనబడ్డ అమితబ్ ఇండియా విజయం అందుకున్న క్షణం తానో కుర్ర వాడిలా ఇండియా ఫ్లాగ్ ను ఎంతో ఉత్సాహంగా ఉప్పారు.. ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన టెండుల్కర్ తో పాటు వి.వి.ఐ.పి జోన్ నుండి మ్యచ్ తిలకించిన అమితాబ్ మ్యాచ్ మొత్తం బాగా ఎంజాయ్ చేశారు.
మ్యాచ్ మొదలవడానికి స్టేడియంలో అమితాబ్ :
అంతేకాదు ఈ మ్యాచ్ లో అమితాబ్ తో పాటుగా అభిషేక్ కూడా సందడి చేయడం జరిగింది. ఇండియన్ డ్రెస్ అవతారంలో అభిషేక్ కనబడి అలరించాడు. ఇక ఎన్నో ఆశలతో భారత్ ను ఓడిద్దామనుకున్న పాక్ కల కలగానే ఉండింది. ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించగా ముందు బ్యాటింగ్ చేసి 118 పరుగులు చేసిన పాక్.. అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలో దిగి భారత్ విజయ బావుటా ఎగురవేసింది. కోహ్లి వీరోచిత బ్యాటింగ్ తో అర్ధ సెంచరి పూర్తి చేసి అజేయంగా జట్టుని విజయ లక్ష్యాన్ని సాధించేలా చేశాడు. 15.5 ఓవర్లలోనే భారత తన లక్ష్యాన్ని సాధించడం జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







