రెబల్ స్టార్ దంపతులకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్..
- October 30, 2021
హైదరాబాద్: తనదైన హాస్యంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన వరసగా సినిమాలు చేయడం లేదు. సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని చిత్రకళకు వెచ్చిస్తున్నారు. ఇక లాక్‌డౌన్ కాలంలో ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన హాస్య బ్రహ్మ… వాటిని చిరంజీవి, రానా, అల్లు అర్జున్ తదితర హీరోలకు బహుమతిగా అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా తను గీసిన షిర్డీ సాయిబాబా చిత్రపటాన్ని రెబల్ స్టార్ కృష్ణం రాజు దంపతులకు బహుమతిగా ఇచ్చారు బ్రహ్మానందం.
ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న కృష్ణం రాజు.. ‘మన కామెడీ జీనియస్ చిత్రకళలోనూ జీనియస్సే. అద్భుతమైన ట్యాలెంట్ కలిగి మంచి మనసున్న వ్యక్తి బ్రహ్మానందం. ఈ ప్రత్యేకమైన బహుమతిని నాకు అందజేసినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మానందం ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగ మార్తాండ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







