గద్దర్ పాట జనం గుండెల్లో...
- March 20, 2016
గద్దర్ వంటి ప్రజా గాయకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన పాటతో ప్రజా యుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న పాటగాడాయన. ప్రజాసమస్యలను, పోరాట పథ గమ్యాన్ని తన పాటతో నిర్దేశించిన పాట నాయకుడాయన. కేవలం డప్పు ఆదరువుతో ఆయన అప్పటికప్పుడే గైకట్టే పాట జనం గుండెల్లోకి బలంగా దూసుకెళ్తుంది. అందుకే ఆయనకు విప్లవిగాయకుడిగా పేరు. అలాంటి గద్దర్ సినిమాలకు పాటలు రాశారు.. ఆయన రాశారనడం కంటే.. ఆయన పాటలను సినిమాలకు వాడుకున్నారంటే బావుంటుంది. ఒరేయ్ రిక్షా సినిమాలో నా రక్తంతో నడుపుతాను రిక్షాను.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. వంటి పాటలు జనంలో బాగా పాపులర్ అయ్యాయి. సినిమాల్లో కాకుండా బయట ఆయన వందల సంఖ్యల గీతాలు రాసి పాడారు.ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ చిత్రంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్నా కాలమా.. వీర తెలంగాణమా.. ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. అలా తెరవెనుక పాటగాడిగా ఉన్న గద్దర్ ను తెరపైకి వేషగాడి తీసుకొచ్చారు నారాయణ మూర్తి. దండకారుణ్యం సినిమాలో ఓ ఐదు నిమిషాల వేషం అడిగి మరీ తీసుకున్నారట. అంతేకాదు.. గద్దర్ ను తన సినిమాలో చేయమని అడిగినవారిలో చాలా పెద్ద నటులే ఉన్నారట. తాను తమ సినిమాల్లో నటిస్తే, కనిపిస్తే బాగుంటుందని అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి దాకా ఎంతోమంది గద్దర్ ను అడిగారట. ఈ విషయం గద్దరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ తన పాటకు ఉన్న పేరును క్యాష్ చేసుకోవడం ఇష్టం లేక సున్నితంగా తిరస్కరించారట గద్దర్.. అదీ సంగతి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







