ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తల నరికివేస్తున్న దృశ్యాలు ..
- March 20, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తల నరికివేస్తున్న దృశ్యాలను స్కూల్ విద్యార్థులకు చూపించినందుకు ఓ టీచర్ కు భారీ ఫైన్ వేశారు. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2014-15లో అమెరికాలోని సౌత్ బ్రాంక్స్ అకాడమీలో లెక్సిక్ నైజారియో అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతడి ఏడాది సంపాధన దాదాపు రూ.60లక్షల పైనే.ఆయన ఉగ్రవాదులకు సంబంధించిన పాఠాలు బోధిస్తూ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక భయంకరమైన వీడియో చూపించాడు. అందులో సముద్రం ఒడ్డున కొంతమంది బందీల తలలు ఏ విధంగా ఉగ్రవాదులు నరికేస్తున్నారో రికార్డయిన దృశ్యాలు ఉన్నాయి. వాటిని చూసిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు తెలిసి ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదుచేయగా పలు దఫాలుగా విచారించిన కోర్టు చివరకు రూ.
20 వేల ఫైన్ వేసింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







