వ్యక్తిగత పనుల కోసం వినియోగిస్తే, యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరిమానా,జైలు శిక్ష

- November 01, 2021 , by Maagulf
వ్యక్తిగత పనుల కోసం వినియోగిస్తే, యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరిమానా,జైలు శిక్ష

రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్), ఎంప్లాయర్ (యజమాని) ఎవరైనా తమ వ్యక్తిగత అవసరాల కోసం కార్మికుల్ని వినియోగిస్తే, ఇతర యజమానుల కోసం వినియోగిస్తే.. అలాంటి యజమానికి 100,000 సౌదీ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుందని పేర్కొంది. సదరు యజమానికి రిక్రూట్మెంట్ బ్యాన్ కూడా ఐదేళ్ళపాటు విధించే అవకాశం వుంది. ఎంప్లాయర్ వలసదారుడైతే, దేశం నుంచి బహిష్కరిస్తారు కూడా. ఉల్లంఘనల్లో ఎంతమంది కార్మికుల్ని వినియోగిస్తే, అందుకు అనుగుణంగా జరీమానా పెరుగుతుంటుంది. ఉల్లంఘనలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుననీ మక్కా అలాగే రియాద్ రీజియన్లకు చెందినవారు 911 నెంబరులోనూ, ఇతర రీజియన్లకు చెందినవారు 999 నెంబరులోనూ ఫిర్యాదు చేయాలనీ సూచించారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com