దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అబుధాబి ప్రిన్స్
- November 05, 2021
యూఏఈ: అబుధాబి ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హిందూవులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వారందరికీ షేక్ మొహమ్మద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి జరుపుకునే వారందరికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అబుదాబి ప్రిన్స్ తన సందేశంలో ఆకాంక్షించారు. “యూఏఈ, ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా దేశం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వారికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కొనసాగాలని మేము కోరుకుంటున్నాము.’’ అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







