భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- November 07, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,853 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,37,49, 900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,44,845 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 260 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4, 60, 791 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో భారత్‌లో 12,432 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 28,40, 174 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,08,21,66,365 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com