అవినీతికి పాల్పడిన 172 మంది అరెస్టు
- November 07, 2021
రియాద్: అవినీతికి పాల్పడిన 172 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ అరేబియా అవినీతి నిరోధక శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో స్థానికులతోపాటు ప్రవాసులు ఉన్నారని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. పట్టుబడ్డ వారిలో రక్షణ, అంతర్గత భద్రత, నేషనల్ గార్డు, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్యం, పర్యావరణం, వాటర్, ఎడ్యుకేషన్ అథారిటీ, కమిషన్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వర్చూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ (Haia)లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని అవినీతి నిరోధక అథారిటీ (Nazaha) తెలిపింది. వారిపై లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ వంటి అభియోగాలు నమోదు చేశారు. రబీ అల్అవాల్ నెలలో Nazaha బృందాలు నిర్వహించిన 6061 తనిఖీల్లో 512 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిని విచారించి 172 మంది నిందితులను అరెస్టు చేసింది. నిందితులను కోర్టులకు రిఫర్ చేయడానికి చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్లు Nazaha తెలిపింది. ఆర్థిక లేదా పరిపాలనాపరమైన అవినీతికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినట్లయితే, టోల్ ఫ్రీ నంబర్ 980 లేదా వెబ్సైట్ www.nazaha.gov.sa లేదా ఇమెయిల్ 980 @ nazaha.gov.sa లేదా ఫ్యాక్స్ 0114420057 లో ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక అథారిటీ (Nazaha) కోరింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







