హైదరాబాద్‌ చాప్టర్‌తో ఒక అడుగు ముందుకేసిన అపోలో డి2డి 2021 డ్యుయాథ్లాన్‌

- November 07, 2021 , by Maagulf
హైదరాబాద్‌ చాప్టర్‌తో ఒక అడుగు ముందుకేసిన అపోలో డి2డి  2021 డ్యుయాథ్లాన్‌

హైదరాబాద్‌: భారతదేశంలో మొదటిసారి ఒక గొప్ప ఉద్దేశ్యంతో వర్చువల్‌గా నిర్వహిస్తున్న డ్యుయాథ్లాన్‌ అయిన అపోలో డి2డి డ్యుయాథ్లాన్‌ కార్యక్రమం హైదరాబాద్‌తో చాప్టర్ మరింత ఊపందుకున్నది. చిన్నారులలో ఏర్పడే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, మద్దతు ఇవ్వడం మరియు చిన్నారుల క్యాన్సర్‌ చికిత్స కోసం అవసరమైన నిధులను సేకరించడాన్ని అపోలో డి2డి లక్ష్యంగా పెట్టుకున్నది.

అపోలో నిర్వహిస్తున్న డాన్‌ టు డస్క్‌ - సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు - (డి2డి) డ్యుయాథ్లాన్‌ అనేది పీడియాట్రిక్‌ క్యాన్సర్‌పై ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు, తక్కువ క్యాన్సర్‌ రిస్క్‌తో కూడిన భవిష్యత్తును మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి యొక్క అవసరాన్ని చేపట్టేలా ప్రోత్సహిస్తుంది

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీమతి శోభనా కామినేని ఈ సందర్బంగా మాట్లాడుతూ, ‘‘పిల్లలే మన దేశానికి భవిష్యత్తు మరియు వారిని రక్షించుకోవడం అనేది మన యొక్క నైతిక కర్తవ్యం. అపోలో క్యాన్సర్‌ సెంటర్ల డ్యుయాథ్లాన్‌లో పాల్గొని, పీడియాట్రిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న పేద పిల్లలకు చికిత్సను అందించే ఒక మంచి కారణం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. అపోలో డి2డి కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని, నిధులను సమీకరించాలని మరియు రేపటి రోజున దేశానికి దిక్సూచిగా మారగల ఇటువంటి చిన్నారుల జీవితాల్లో మార్పును తీసుకురావాలని మేము బలంగా కోరుకుంటున్నాము.’’ అని ఆమె అన్నారు.

డాన్‌ టు డస్క్‌ డ్యుయాత్లాన్‌, 2021 అనేది మంచి కారణం కోసం తమ వంతు సహాయం అందించడమే కాకుండా  ఇంకోవైపు రన్నింగ్‌ మరియు సైక్లింగ్‌ల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం అనే రెందు మంచి ఉద్దేశాలతో, భావసారుప్యాలు కలిగిన వ్యక్తులు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అపోలో క్యాన్సర్‌ సెంటర్లు మరియు నెవిల్లే ఎండీవర్స్‌ ఫౌండేషన్‌ల మద్దతుతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 13 నవంబర్‌ 2021 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com