ఈ క్రేజీ కాంబో తో అభిమానులకు పండగే!

- November 07, 2021 , by Maagulf
ఈ క్రేజీ కాంబో తో అభిమానులకు పండగే!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్ర్కీన్ షేర్ చేసుకుంటే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మంచి కథ దొరికితే.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కించాలని పలువురు దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే దానికి ఇప్పుడు సమయం ఆసన్నమైందని అంటున్నారు. చిరు, పవన్ ఇద్దరూ ఒక సినిమాలో అన్నదమ్ములుగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. Mega 154 సినిమాతోనే ఆ కోరిక తీరనుందని వినికిడి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం  నిన్న (శనివారం) పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి పక్కా మాస్ పాత్రను పోషిస్తున్నారు. వైజాగ్ హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకి ‘వాల్తేరు శీను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇందులో చిరంజీవి తమ్ముడిగా నటించేందుకు పవన్ కళ్యాణ్ ను బాబీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాలో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. దానికి చిరు సొంత తమ్ముడైతే ఇంకా బలంగా ఉంటుందని బాబీ ఆయన్ను సంప్రదించారట. మరి పవన్ దానికి ఒప్పుకుంటారా లేదా అన్నది సంశయమే. ‘వెంకీ మామ’ మూవీతో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్యను ఒక స్ర్కీన్ పై ఆవిష్కరించి అభిమానుల్ని అలరించారు బాబీ. ఈ తరహాలోనే ఇప్పుడు మెగాస్టార్ , పవర్ స్టార్ తో బాబీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే పవర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తారేమో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com