పెట్రోల్ ధరలు తగ్గించం: సీఎం కేసీఆర్
- November 07, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తావుంటే తాను చూస్తూ ఊరుకోనని చెప్పారు సీఎం కేసీఆర్. పెట్రోల్, డీజిల్ రేట్లపై సెస్ ను కేంద్రమే పెంచిందన్నారు. సెస్ పెంచి రాష్ట్రాల వాటాను కేంద్రం ఎగ్గొట్టిందన్నారు సీఎం. పెట్రోల్ సెస్ ను పెంచిన కేంద్రం… దేశంలో పప్పులు, ఉప్పులు సహా అన్ని ధరలు పెరిగేందుకు కారణమైందని ఆరోపించారు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడంతో.. అన్నింటి రేట్లు పెరిగాయన్నారు. వెంటనే పెట్రోల్ పై కేంద్రం పెంచిన సెస్ మొత్తాన్ని విరమించుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల వ్యాట్ ను తగ్గించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రపంచంలో ఏ దేశం పెంచలేదన్నారు. కేంద్రమే సెస్ పెంచుతూ పోయిందని.. గతంలో ఎంత వ్యాట్ ఉందో అంతే వ్యాట్ తెలంగాణలో కొనసాగుతోందన్నారు.
“మేము ఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదు. మేం వ్యాట్ తగ్గించాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణలో వ్యాట్ తగ్గించం. పెట్రోల్ డీజిల్ పై సెస్ రద్దు చేయాలని మేమే పోరాటం చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం అడ్డదారిలో.. దొడ్డిదారిలో పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు.” అని కేసీఆర్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







