లైసెన్సు లేకుండా డ్రైవింగ్: 23 మంది అరెస్ట్
- November 09, 2021కువైట్: లైసెన్సు లేకుండా వాహనాలు నడుుతున్న 23 మందిని ట్రాఫిక్ క్యాంపెయిన్‌లో భాగంగా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, వాహనాల్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, పలు క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా వున్న నలుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పించుకు తిరుగుతున్న 13 మంది అరెస్టయ్యారు.ఒకరు డ్రగ్ కు సంబంధించిన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. రెసిడెన్సీ గడువు తీరిన 12 మంది కూడా వున్నారు. ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్లు లేనివారు 13 మంది. ఆరు వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొత్తం 199 ఉల్లంఘనల్ని జారీ చేశారు సోమవారం రోజున.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి