వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..

- May 14, 2024 , by Maagulf
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..

వారణాసి: లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి  మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు పుష్య నక్షత్ర సమయంలో మోదీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నియోజకవర్గం నుంచి మోదీ 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడోసారి పోటీ చేసేందుకు మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు గంగా సప్తమి సందర్భంగా గంగా నదిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాలభైరవ ఆలయాన్ని మోదీ సందర్శిస్తారు.

మోడీ నామినేషన్ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, లోక్‌దళ్‌ అధ్యక్షుడు జయంత్‌ చౌదరి, ఎల్‌జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌, అప్నాదళ్‌ (ఎస్‌) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ సహా ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గోనున్నారు. అదేవిధంగా బీజేపీ, ఎన్డీఏ ముఖ్యమంత్రులు యోగి ఆడిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ సింగ్ ధామి, మోహన్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, ఏకనాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత బిస్వ శర్మ, నయాబ్ సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమాంగ్, మాణిక్ సాహా పాల్గోనున్నారు.

మోదీ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. జూన్ 1న ఏడో విడతలో భాగంగా వారణాసి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. వారణాసిలో మోదీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మూడోసారి పోటీ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com