ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంటుతో హ్యూమన్ ట్రాఫికర్స్ గుట్టు రట్టు
- November 10, 2021
మనామా: ఇంటర్ పోల్ జారీ చేసిన వారెంట్ ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగు గుట్టుని రట్టు చేశారు. కోర్టు వివరాల్లోకి వెళితే, బహ్రెయినీ పోలీసులు ఓ ఆసియా మహిళకు సంబంధించి వారెంటుని ఇంటర్‌పోల్ నుంచి అందుకోవడం జరిగింది. ఆమెను అరెస్టు చేయగా, ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ రాకెట్‌తో సంబంధం వున్నట్లు తేలింది. జుఫ్ఫయిర్‌లో ఆ మహిళను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. 130 బహ్రెయినీ దినార్లకు ఒక్కో మహిళను వేరే మహిళల వద్ద కొనుగోలు చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించింది. ఆ మహిళల్ని కూడా అెస్టు చేశారు. మహిళ చెప్పిన వివరాలతో ఓ అపార్టుమెంట్ వద్దకు వెళ్ళగా, అక్కడ బందీగా వున్న మహిళలు పోలీసులకు కనిపించారు. వారిని పోలీసులు విడుదల చేశారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







