హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
- November 16, 2021
తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు… తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్నారు హీరో విజయ్.
సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు హీరో విజయ్. అయితే తాజాగా హీరో విజయ్ ఇంట్లో బాంబు అనే వార్త కలకలం రేపుతోంది.
విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో శనివారం అర్ధరాత్రి నీలంగారైల్లోని… ఆయన ఇంట్లో పాలు నిర్వహించారు పోలీసులు. నీలంగారై పోలీసులు బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీ చేశారు. అయితే ఈ తనిఖీల్లో బాంబు ఎక్కడ దొరకలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విచారణ లో విల్లుపురం జిల్లా.. మరక్కణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మతిస్థిమితం లేని యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినట్లు తెలిసింది. అతను గతంలో కూడా పలువురు రాజకీయ అలాగే సినీప్రముఖుల ఇళ్లలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ చేశాడని విచారణలో తేలింది.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







