టెస్లా ఉద్యోగులకు మస్క్ సలహా ఏంటో తెలుసా..
- November 20, 2021
పాటలు వింటూ పని చేయడం చాలా మందికి అలవాటే. దానివల్ల పనిమీద మరింత ఏకాగ్రత పెరుగుతుందని చెబుతారు. మరి ఆఫీస్‌లో అలాంటి వెసులుబాటే ఉంటే..!
ఆహా.. వర్క్ టైంలో మ్యూజిక్ వింటే ఏ బాస్ ఊరుకుంటారు.. అనే కదా మీ సందేహం. కానీ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ మాత్రం తన ఉద్యోగులకు ఇదే సలహా ఇస్తున్నారు. మ్యూజిక్ వింటూ పనిచేయండంటూ తన సిబ్బందికి లేఖ కూడా రాశారు.
ఇటీవల ఎలాన్ మస్క్ టెస్లా ఉద్యోగులకు పంపిన ఓ ఈ-మెయిల్‌ను ఓ అమెరికా మీడియా సంస్థ ప్రచురించింది. అందులో ఆయన పని ప్రదేశాల్లో మ్యూజిక్ గురించి తన అభిప్రాయాలను సిబ్బందితో పంచుకున్నారు. ''ఫ్యాక్టరీలో సంగీతాన్ని నేను ఎంతో సపోర్ట్ చేస్తాను. దాని వల్ల ఉద్యోగులు తమ పనిని మరింత ఉల్లాసంగా చేసుకోగలరు. ఇటీవల ఓ అసోసియేట్ నన్నో మాట అడిగారు. ఒక చెవితో మ్యూజిక్ వింటూ.. మరో చెవితో భద్రతా పరమైన అంశాలను వినొచ్చా..! అని అడిగారు. అది నాకు మంచిదే అనిపించింది. ఆఫీస్‌లో మీరు రోజును మరింత అందంగా మార్చుకునేలా ఎలాంటి ఐడియాలున్నా నా దృష్టికి తీసుకురండి. మీరు ప్రతి రోజూ ఆఫీస్‌కు వచ్చేందుకు ఎదురు చూడాలనే నేను కోరుకుంటా..'' అని మస్క్ తన మెయిల్లో పేర్కొన్నారు.
ట్విటర్లో ఎంతో చురుగ్గా ఉండే మస్క్.. ఆఫీస్‌లో తన ఉద్యోగులతోనూ అంతే కలివిడిగా ఉంటారట. అందుకే అమెరికాలోని టాప్ 10 ఆరాధ్య సీఈవోల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. ఈ జాబితాలో మస్క్ 8వ ర్యాంక్‌లో ఉన్నట్లు 2017లో గ్లాస్‌డోర్ అనే సంస్థ తమ వార్షిక నివేదికలో పేర్కొంది. అంతేనా.. మస్క్ సారథ్యాన్ని తన కంపెనీల్లో 98శాతం మంది సిబ్బంది ఆమోదిస్తున్నారని గ్లాస్‌డోర్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







