నాగార్జున కి హీరోయిన్ సమస్య
- November 20, 2021
ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తన తదుపరి సినిమా అయినా "గోస్ట్" తో బిజీగా ఉన్నారు.
ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి హీరోయిన్ విషయంలో చిత్ర బృందానికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ముందుగా ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె ను పెట్టి రెండు మూడు రోజులు షూటింగ్ కూడా జరిపారు.
కానీ త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ అమల పాల్ ను ఎంపిక చేశారు. కానీ ఈమె ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. పైగా ఈ సినిమాలో నాగార్జునతో స్విమ్మింగ్ పూల్ లో ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. దీంతో ఆమె భారీ మొత్తాన్ని అడిగింది. నిర్మాతలు నో చెప్పడంతో ఆమె కూడా సినిమా నుంచి తప్పుకుంది. ఇలా ఇద్దరు హీరోయిన్లు సినిమా నుండి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







