ఉమ్రా చేయని వారికి కూడా త్వరలో ‘తవాఫ్’ అనుమతి
- November 22, 2021
సౌదీ: ఉమ్రా చేసేవారు కాకుండా ఇతర ఆరాధకులను కూడా పవిత్ర కాబా (తవాఫ్) చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి త్వరలో అనుమతించనున్నారు. తవాఫ్ బుకింగ్ అపాయింట్‌మెంట్‌లను సులభతరం చేయడానికి రాబోయే వారాంతంలో ఈట్‌మార్నా, తవక్కల్నా అప్లికేషన్‌లకు "తవాఫ్" పేరుతో మరో ఆప్షన్ ను ప్రవేశపెట్టనున్నారు. యాత్రికులు, ఆరాధకుల కోసం గ్రాండ్ మసీదు పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేందుకు అనుమతించాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఇటీవలి ఆదేశించిన విషయం తెలిసిందే. బ్లాక్ స్టోన్ (అల్-హజర్ అల్-అస్వద్), యెమెన్ కార్నర్‌ను తాకడం (అల్-రుక్న్ అల్-యమాని), హిజ్ర్ ఇస్మాయిల్ వద్ద ప్రార్థన చేయడం కోసం అపాయింట్‌మెంట్లను ఈట్‌మార్నా, తవక్కల్నా అప్లికేషన్‌లలో బుక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్..
- మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్‌చేంజ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!









