రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- February 17, 2026
మనామా: పవిత్ర రమదాన్ మాసం కోసం బహ్రెయిన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. నిత్యవసరాల మార్కెట్ ను నియంత్రించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పర్యటనలను ముమ్మరం చేస్తోంది. రాజ్య వ్యాప్తంగా వాణిజ్య సముదాయాలలో తనిఖీలను మొదులుపెట్టింది. అదే సమయంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
రమదాన్ సందర్భంగా పలు దుకాణాలు ప్రకటించిన డిస్కౌంట్లు, ఆఫర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే పద్ధతులు, వాణిజ్య మోసాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.
రమదాన్ సందర్భంగా ఫుడ్ కోర్టులు, పండ్లు మరియు కూరగాయల దుకాణాలు, మాంసం మరియు చేపల మార్కెట్లు, టైలరింగ్ సేవలు, బంగారు దుకాణాలు మరియు స్వీట్ రిటైలర్లు వంటి అధిక డిమాండ్ ఉన్న కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది.
తనిఖీల సందర్భంగా ఉల్లంఘనలను గుర్తిస్తే.. జరిమానాలతోపాటు లైసెన్సుల రద్దు వంటి కఠినమైన చర్యలకు వెనుకాడబోమని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. వినియోగదారులు జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ తవాసుల్ ద్వారా, 17111225లో వాట్సాప్ ద్వారా లేదా [email protected] ఇమెయిల్ ద్వారా ఏదైనా ఉల్లంఘనలను నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







